పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం
డోర్నకల్/సీరోల్, జనంసాక్షి : మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం చిలుకోయాలపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి మహమ్మద్ యాకూబ్ పాషా మంగళవారం ఉదయం గ్రామపంచాయతీ కార్యాలయంలో భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్టు విశ్వాసనీయ సమాచారం. అది గమనించిన కొంతమంది గ్రామ సిబ్బంది హుటాహుటిన మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రోడ్డు తీర్మానం అడిగినందుకు ఎన్నికల కోడ్ ఉందని కార్యదర్శి సమాధానం ఇచ్చాడు. దీంతో కొంతమంది వేదింపులు భరించలేక ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలిసింది.