హైదరాబాద్, (జనంసాక్షి బ్రేకింగ్ న్యూస్) :

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలు చురుగ్గా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు హైదరాబాద్‌కు చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం… సంబంధిత అధికారులతో, పోలీసు అధికారులతో సమావేశం కానున్నది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ప్రత్యేకంగా భేటీ కానున్న ఈ బృందం.. ఎన్నికల సన్నద్ధతపై ఆరా తీయనున్నట్టు తెలిసింది. మూడు రోజుల పర్యటనలో భాగంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్ నేతృత్వంలోని 17 మంది అధికారుల బృందం తాజ్‌కృష్ణాలో బస చేయనుంది. సీఈసీ బృందం రాకతో అతిత్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మూడురోజుల అనంతరం ఈ పర్యటన వివరాలను ఎన్నికల అధికారులు వెల్లడిరచనున్నారని తెలిపారు.