కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి ఫ్లెక్సీ వివాదం
గంభీరావుపేట (జనంసాక్షి ): గంభీరావుపేట మండల కేంద్రంలో వడ్ల కొనుగోళ్ల ప్రారంభోత్సవానికి గురువారం కొనుగోలు ప్రారంభోత్సవానికి ఏఎం సీ చైర్మన్ విజయ తహసీల్దార్ మారుతీ రెడ్డి విచ్చేసిన క్రమంలో, కాంగ్రెస్ నాయకులు మరియు బిఆర్ఎస్, మరియు బీజేపీ నాయకులు, ఫ్లెక్సీ రగడ జరిగింది. బిఆర్ఎస్, మరియు బీజేపీ నాయకులు నాయకులు స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేదంటూ ఫ్లెక్సీ ని టౌన్ అధ్యక్షుడు వెంకట యాదవ్ మరియు శ్రీశైలం, తీసివేయగా, దీనికి లింగం యాదవ్ స్థానిక ఎమ్మెల్యే కేటీ ఆర్ ఫోటో లేకుండా ఎలా ప్రారంభిస్తారు అని ప్రశ్నించారు. బిజెపి నాయకుడు రాజేందర్ రెడ్డి ఎంపీ బండి సంజయ్ ఫోటో కూడా లేదంటూ వాగిద్వానికి దిగారు, దీనితో ఒక్కసారిగా గొడవ పెరిగి, ఇరువురి మధ్య తోపుసలాట జరిగినది, బిజెపి నాయకుడు రాజేందర్ రెడ్డి ఎమ్మార్వో ను వడ్లు 42 కిలోలు ఎలా పెడతారని ప్రశ్నించారు, దీనితో అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఇంతకుముందు బీ ఆర్ ఎస్ గవర్నమెంట్ లో ఇలాగే పెట్టారు కదా అలా పెడతామని, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ, తిరుపతి, పర్శహన్మండ్లు, మండల అధ్యక్షుడు, హమీద్, మార్కెట్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, లింగం ప్రభాకర్,గొడవకు దిగారు, దీనితో ఒక్కసారి గొడవ పెరగడంతో, ఎస్సై ప్రేమ్ నందన్,అక్కడ సంఘటన స్థానానికి చేరుకొని, టిఆర్ఎస్ నాయకులు తీసుకొని వెళ్ళిపోయారు, ఇది ఇలా ఉండగా మల్లారావు అనే రైతు 42 కిలోలు ఎలా పెడతారని ప్రశ్నించారు, ఎమ్మార్వో మారుతి రెడ్డి, సమాధానం ఇస్తూ, వడ్లు ఎగబోసి తీసుకొని రండి 40 కిలోలు 600 గ్రాముల పెడతామని చెప్పారు, తర్వాత కొనుగోలు ప్రారంభోత్సవం, ఎమ్మార్వో తిరుపతిరెడ్డి తో పాటు, మార్కెట్ కమిటీ,, చైర్మన్ డైరెక్టర్లు, మహిళా గ్రూప్ ఏపీఎం సుదర్శన్, మహిళా అధ్యక్షురాలు సిఓలు , రైతులు పాల్గొన్నారు.