అభివృద్ధిని విస్మరిస్తున్న కాంగ్రెస్ సర్కార్

నడికూడ, డిసెంబర్ 1 (జనం సాక్షి):
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.
రాయపర్తి గ్రామం నుండి పలువురు బిఆర్ఎస్ లో చేరిక.
మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్లే ప్రజలు నేడు మంచి రోజులు చూస్తున్నారని, ఇలాంటి పాలన మరల రావాలంటే బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.సోమవారం నడికూడ మండలంలోని రాయపర్తి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు,మాజీ సర్పంచ్ అకినపెల్లి లింగయ్య,నాయకులు కోడెపాక బాబులు, చెన్న గణేష్‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారికి చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ అమలు చేయలేని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పూర్తిగా విస్మరిస్తోందని, దోపిడీ, స్కాంలకే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రాధాన్యతనిస్తున్నదని ఆరోపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీచేస్తున్న అభ్యర్థులందరిని భారీ మెజారిటీలతో గెలిపించి కేసీఆర్‌కు, తెలంగాణ భవిష్యత్‌కు బలమైన మద్దతు ఇవ్వాలని కోరారు.కాంగ్రెస్ మాయమాటలకు మరోసారి మోసపోవద్దని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మండల బీఆర్‌ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.



