జీఓ 21 రద్దు చేయాలని కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన
నల్లగొండ ( జనంసాక్షి) తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకై ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 21ని రద్దు చేయాలని అలాగే బుధవారం ఉన్నత విద్యా మండలికి వెళ్లిన అధ్యాపకుల అరెస్టులను ఖండిస్తూ గురువారం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులు, పోస్టర్లను పట్టుకుని తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీసీ చాంబర్ వద్ద ఆందోళన చేపట్టారు. ఏళ్ల తరబడి యూనివర్సిటీలో రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జీఓ 21 రద్దుచేసి తమ న్యాయమైన సమస్యను పరిష్కరించి రెగ్యులర్ చేయాలని కోరారు.