జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు మానుకోవాలి : సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం ప్రభుత్వాలు మానుకోవాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రభుత్వాలను విమర్శించడం జర్నలిస్టుల హక్కు అని తెలిపింది. ఈ మేరకు ఓ కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. యూపీకి చెందిన అభిషేక్ ఉపాధ్యాయ్ అనే జర్నలిస్ట్‌పై యూపీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను పరిశీలిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తే భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్లే అవుతుందని స్పష్టం చేసింది. అభిషేక్ ఉపాధ్యాయ్‌పై ప్రభుత్వంపై ఓ స్టోరీ రాశారు. దీనిపై యూపీ పోలీసులతో పాటు వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి.