అనాధ పిల్లలకు నిత్యావసర సరుకుల పంపిణీ

వరంగల్ ఈస్ట్, నవంబర్ 15(జనం సాక్షి )వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఉరుసులో గల ఏసుక్రీస్తు విశ్వాసుల సంఘం 33వ వార్షికోత్సవ సందర్భంగా శుక్రవారం హనుమకొండ సుబేదారి అశుంత ఆశ నిలయం లోని అనాధ పిల్లలకు సుమారు లక్ష రూపాయల విలువ గలిగిన నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్ రెవరెండ్ వైయస్ రాజశేఖర్ మాట్లాడుతూ చర్చి వార్షికోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం పేదలకు అన్నదానం తో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. చర్చి అధ్యక్షులు కలకోట్ల షడ్రక్ మాట్లాడుతూ ఏసుప్రభు చెప్పిన విధంగా బీదలకు సేవ చేసే వాళ్ళు ధన్యులు అని మాటను అనుసరిస్తూ తాము ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తున్నట్లు చెప్పారు. సంఘ సలహాదారులు మాణిక్యం మాట్లాడుతూ పేదలకు నిరంతరం సేవ చేస్తూ వారి క్షేమం కోసం చూడాలని ఏసుక్రీస్తు చెప్పిన విధంగా తాము పాటిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ వేల్పుగొండ డేవిడ్, జాయింట్ సెక్రెటరీ కలకోట్ల భరత్ ట్రెజరర్ రేణిగుంట్ల రాజు, యాకూబ్ రవీందర్ విజయ్ కుమార్, ఆకుల, సంజీవయ్య, కలకోట్ల సంపత్, గాదే యాకూబ్, తోపాటు, స్త్రీల సమాజం, సంఘ సభ్యులు పాల్గొన్నారు.



