అసిస్టెంట్ ప్రొఫెసర్ రుక్సానా మొహమ్మద్ కు డాక్టరేట్

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న రుక్సానా మొహమ్మద్ కు ఉస్మానియా యూనివర్సిటీ నుండి కామర్స్ విభాగంలో డాక్టరేట్ పట్టా లభించింది. ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డు ప్రొఫెసర్ శంకరయ్య పర్యవేక్షణలో ‘కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ అకౌంటింగ్ ప్రాక్టీసెస్ ఏ స్టడీ ఇన్ సెలెక్ట్ కంపెనీస్’ అనే అంశంపై పరిశోధన చేసి ఉత్తీర్ణురాలైనందున ఉస్మానియా యూనివర్సిటీ రుక్సానా మొహమ్మద్ కు కామర్స్ విభాగంలో డాక్టరేట్ అందజేశారు. పరిశోధనలో పర్యావరణ హితం కోసం పర్యావరణంకి కార్పొరేషన్ కంపెనీలు తీసుకుంటున్న చర్యలను తెలియజేస్తూ భవిష్యత్ లో పర్యావరణ పరిరక్షణకు కంపెనీలు నిర్వర్తించాల్సిన చర్యల్ని సలహాలుగా అందించారు. ఈ నెల 25 వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ విభాగం లో జరిగిన మౌఖిక పరీక్షలో ఉత్తీర్ణురాలైనందున కామర్స్ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ ఛైర్మన్ ప్రొఫెసర్ కృష్ణ చైతన్య చేతుల మీదుగా ఈ డాక్టరేట్ అందుకున్నారు. ఐదు సంవత్సరాలు కృషి చేసి డాక్టరేట్ అవార్డు అందుకున్న డాక్టర్ రుక్సానా మొహమ్మద్ ను చైర్మెన్ తో పాటు, డిపార్ట్మెంట్ హెడ్, కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, తోటి అధ్యాపకులు అభినందించారు. పారిశ్రామిక అభివృద్ధి అతివేగంగా జరుగుతున్న నేటి సమాజంలో పర్యావరణ హితం కోసం ఇలాంటి పరిశోధనలు ఎంతో ఉపకరిస్తాయని సమావేశానికి హాజరయిన పలువురు ప్రొఫెసర్లు కొనియాడారు.