ప్రజల సమయానికి విలువ లేదా..?

మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని రోడ్లు & భవనాల శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ కార్యాలయం వద్ద అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. సాయంత్రం 3 గంటలు అయినప్పటికీ కార్యాలయం తెరుచుకోకపోవడంతో పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు, రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.అధికారులను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందన లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు సేవలు అందించాల్సిన సమయంలో తాళాలు వేసి ఉండటంపై స్థానికులు మండిపడుతున్నారు.“ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు కార్యాలయానికే రాకపోతే ఎలా..?” అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.