చిన్నారి పై కుక్క దాడి..!
చెన్నారావుపేట, జనవరి 5
(జనం సాక్షి):
తీవ్ర గాయాల పాలైన చిన్నారి…
అమీనాబాద్ లో చోటుచేసుకున్న సంఘటన…
చిన్నారి పై కుక్క దాడి చేసి కరిచిన సంఘటన మండలంలోని అమీనాబాద్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం… ఇదే అమీనాబాద్ గ్రామంలోని (కొత్తపల్లె) కు చెందిన సయ్యద్ కరీం చిన్న కూతురు యాకూబి ఆదివారం సెలవు దినం కావడంతో ఇంటి బయట ఆడుకుంటుంది. కుక్క ఒక్కసారిగా వచ్చి చిన్నారి పై దాడి చేసి కరిచింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చుట్టుపక్కల వారు గమనించి చికిత్స నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తలకు ఏడు కుట్లు పడ్డట్లు తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చిన్నారి చికిత్స పొందుతోంది.

