నింగికేగిన హరిత విప్లవ పితమహుడు

హైదరాబాద్‌, (జనంసాక్షి బ్రేకింగ్‌ న్యూస్‌) :
ప్రముఖ వ్యవసాయశాస్త్రవేత్త, భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ ఇకలేరు. వృద్ధాప్య సమస్యలతో గురువారం తుదిశ్వాస విడిచారు. దీంతో భారతదేశం వ్యవసాయ రంగ పెద్దదిక్కును కోల్పోయింది. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, మహిళా రైతుల సాధికారతకు ఆధ్యుడు.
‘అధిక దిగుబడిని ఇచ్చే వరివంగడాలను సృష్టించి వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన స్వామినాథన్‌ మృతి యావత్‌ రైతు లోకానికి తీరనిలోటు. భారతదేశం ఆహారం కోసం ఇతరదేశాలపై ఆధారపడే అవసరం లేకుండా ఆహారధాన్యాల స్వయం సమృద్ధికి ఆయన చేసిన కృషి శ్లాఘనీయం. అయన భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి. అయన అనేక సూచనలను సీఎం కేసీఆర్‌ పాటిస్తూ, రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని సుసంపన్నం చేశారు. ఆయన మృతిపై సిఎం కెసిఆర్‌, మంత్రులు కెటిఆర్‌, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, హోంమినిస్టర్‌ మహుమూద్‌ అలీ, పలువురు మంత్రులు, నాయకులు, ప్రముఖులు సంతాపం తెలిపారు.