తెలంగాణలో  తొలి విజయం కాంగ్రెస్ పార్టీ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆ పార్టీ తరఫున అశ్వారావుపేటలో పోటీ చేసిన ఆదినారాయణ ఘన విజయం సాధించారు. 28,358 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలోని మరో 63 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 40 చోట్ల లీడ్ లో ఉన్నారు. ఇక బీజేపీ కేవలం 9 స్థానాల్లో లీడ్ లో ఉండగా.. ఆ పార్టీలోని ముఖ్య నేతలు కూడా వెనుకంజలో ఉండడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా మిగతా పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం ఆరుగురు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.