జడ్చర్ల అభివృద్ధిపై మాట్లాడే హక్కు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి లేదు.
అక్రమ భూ దందాలు తప్ప అభివృద్ధి శూన్యం.
మా నాయకుడి పై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదు.
విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి.
మిడ్జిల్. 13:( జనం సాక్షిజడ్చర్ల అభివృద్ధిపై మాట్లాడే హక్కు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కి లేదని. బిఆర్ఎస్ పాలనలో జడ్చర్లలో భూ అక్రమ దందాలు. దొంగ రిజిస్ట్రేషన్లు కమీషన్లకు తప్ప అభివృద్ధి శూన్యమని. జడ్చర్ల అభివృద్ధి పథంలో నడిపించడంకోసమే రాజకీయాలకు వచ్చిన నీతి నిజాయితీ గల నాయకుడు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. అని మా నాయకుడి పై చోటా మోటా లీడర్ల తో అనుచిత ప్రచారం చేయిస్తున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి ఇలాంటి రాజకీయాలు చేయడం తగదని. మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి. మాజీ తాజా ప్రజా ప్రతినిధులతో కలిసి. విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో జడ్చర్ల నియోజకవర్గం లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని అభివృద్ధి లక్ష్యంగా పనులు చేస్తున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి.అనుచరులతో చిల్లర రాజకీయాలు చేస్తూ నీతి నిజాయితీ గల ఎమ్మెల్యే మా నాయకుడు అనిరుద్ రెడ్డి పై అచిత వాక్యాలు చేయడం సరైనది కాదని సూచించారు. గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో నిరుపేదలకు జీవనోపాధి కోసం ప్రభుత్వం అందించే సరుకులు తీసుకునేందుకు కనీసం రేషన్ కార్డు కూడా అందజేయని దుస్థితి బిఆర్ఎస్ పాలనదని అన్నారు. మా ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షపాతి అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలో ఎమ్మెల్యే జనం మెచ్చిన జనంపల్లి అనిరుద్ రెడ్డి ఎన్నో నిధులు తీసుకొచ్చారని సూచించారు. 21. 33/ 11 సబ్ స్టేషన్లు. ఒకటి 132 / 33 కెవి సబ్స్టేషన్. నవోదయ పాఠశాల ఉదండాపూర్ భూ నిర్వాసితులకు పరిహారం పెంపు బాల్నగర్ లో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ పాఠశాల. మహబూబ్నగర్ జిల్లా కు త్రిబుల్ ఐటీ. జడ్చర్ల పట్టణంలో స్టార్ము వాటర్ డ్రైనేజి నిర్మాణాలకు భారీ నిధులు. మహిళలకు ఉచిత బస్సు ఉచిత విద్యుత్తు అర్హులందరికీ రేషన్ కార్డులు ప్రతి గ్రామ పంచాయతీ ఐదు లక్షలు.నిధులు చెప్పుకుంటూ పోతే మరెన్నో అభివృద్ధి పనులు కేటాయించిన ఘనత ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. బిఆర్ఎస్ పాలనలు మిడ్జీల్ మండలంలోని డబల్ బెడ్రూం నిర్మాణాల పేరుతో 45 లక్షలు కాజేశారని పేదలకు ఇండ్లు కట్టిస్తాము అని నమ్మాబలికి మోసం చేసిన చరిత్ర బిఆర్ఎస్ ప్రభుత్వం నాయకులది. త్వరలో నియోజకవర్గంలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చేసిన మోసాలు కుంభకోణాలను బయటపెడతామని అనుక్షణం మీ వెంటే ఉంటూ మీరు ప్రజలకు చేసిన మోసాలను వివరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు. మాజీ ఎంపిటిసిలు. మాజీ సర్పంచులు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.



