బిజెపి రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా గడ్డం కాశీనాథ్ నియామకం

మెదక్ మే 16 (జనం సాక్షి ): బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు సూచనల మేరకు *బిజెపి ఒబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు జి. ఆనంద్ గౌడ్ *బిజెపి ఒబిసి మోర్చా రాష్ట్ర పదాధికారులను, కార్యవర్గాన్ని నియమించారు.. మెదక్ జిల్లాకు చెందిన గడ్డం కాశీనాథ్ ను రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. గడ్డం కాశీనాథ్ 1974 నవంబర్ 10న జన్మించారు బాల్య స్వయంసేవగా వారు సంఘ సేవకునిగా పరిచయమై ఏబీవీపీ, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దల్, హిందూ వాహిని లో చురుకైన పాత్రలు పోషించి భారతీయ జనతా పార్టీలో టైగర్ నరేంద్ర గెలుపుకు కృషి.. పోలీసుల అక్రమ కేసుల పై పోరాటం మెదక్ పట్టణ బిజెపి ఉపాధ్యక్షుడిగా, భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిగా.. జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఉమ్మడి మెదక్ జిల్లా వాణిజ్య వ్యాపారం విభాగ కన్వీనర్ గా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన గడ్డం కాశీనాథ్, మెదక్ జిల్లా కేంద్రం కోసం రిలే నిరాహార దీక్షలో పాల్గొని రైల్వే ఉద్యమంలో భాగస్వాములు కావడం,2017 లో మెదక్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడిగా నియమకం మెదక్ పట్టణంలో వినాయక నిమజ్జనం సమయంలో అన్య మతాల బొమ్మలు మేమెంటుపై వేయడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమానికి అధ్యక్షత వహించడం నర్సాపూర్ లో పూస్తే మెట్టెలు తీసి పరీక్షలకు హాజరు కావాలన్న దానిపై జిల్లా వ్యాప్త నిరసనలు.. అక్రమ కేసులను ఎదుర్కొన్న గడ్డం కాశీనాథ్ ,బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర మెదక్ జిల్లా కామారెడ్డి జిల్లా రూట్ మ్యాప్ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టి 2018 ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియామకం 2020లో బిజెపి జిల్లా సహా కోశాధికారిగా నియామకం 2023 నుండి బిజెపి ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడిగా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు స్వచ్ఛభారత్ బీసీ హక్కుల కోసం ప్రభుత్వాన్ని ఎండగట్టిన గడ్డం కాశీనాథ్ ..పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ఓబిసి కార్యవర్గ సభ్యునిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు కి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవ నేని రఘునందన్ రావు గారికి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ కి మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ కి ధన్యవాదాలు తెలిపిన గడ్డం కాశీనాథ్.

తాజావార్తలు