అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్‌

 

 

 

 

 

 

నవంబర్ 7 (జనం సాక్షి) శబరిమల అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది. చర్లపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్‌ నుంచి రైళ్లు కొల్లానికి వెళ్తాయని చెప్పింది. చర్లపల్లి-కొల్లం (07107) రైలు నవంబర్‌ 17, 24, డిసెంబర్‌ 1, 8, 15, 22, జనవరి 5, 12, 19 తేదీల్లో అందుబాటులో ఉంటాయని.. ఆయా రైళ్లు ప్రతి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది. కొల్లం-చరల్లపల్లి (07108) రైలు నవంబర్‌ 19, 26, డిసెంబర్‌ 3, 10, 17, 24, 31, జనవరి 7, 14, 21 తేదీల్లో అందుబాటులో ఉంటాయని.. ప్రతి బుధవారం ఉదయం 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని వివరించింది. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడె, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, పొడనూర్‌, పాలక్కడ్‌, త్రిస్సూర్‌, అలువ, ఎర్నాకులం టౌన్‌, కొట్టాయం, తిరువల్ల, కాయకులం స్టేషన్లలో ఆగుతుందని తెలిపింది.

నర్సాపూర్‌ టూ కొల్లం ఇలా..

నర్సాపూర్‌-కొల్లం (07105) రైలు నవంబర్‌ 16, 23, 30, డిసెంబర్‌ 7, 14, 21, 28, జనవరి 4, 11, 18 తేదీల్లో రైళ్లు నడుస్తాయని.. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు గమ్యస్థానం చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కొల్లం-నర్సాపూర్‌ (07106) రైలు నవంబర్‌ 18, 25, డిసెంబర్‌ 2, 9, 16, 23, 30 జనవరి 6, 13, 20 తేదీల్లో రైళ్లు నడుస్తాయని.. ప్రతి ఆదివారం వేకువ జామున 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని పేర్కొంది. రైలు పాలకొల్లు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట, కాట్పడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, పొదనూరు, పాలక్కడ్‌, త్రిస్సూర్‌, అలువ, ఎర్నాకులం టౌన్‌, కొట్టాయం, తిరువల్ల, చెంగనూర్‌, కాయంకులం స్టేషన్లలో ఆగుతుందని వివరించింది.

మచిలీపట్నం నుంచి..

మచిలీపట్నం-కొల్లం (07101) రైలు నవంబర్‌ 14, 21, 28, డిసెంబర్‌ 26, జనవరి 2 తేదీల్లో రైళ్లు నడుస్తాయని ఆయా రోజల్లో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి పదిగంటలకు గమ్యస్థానం చేరుతుంది. కొల్లం – మచిలీపట్నం (07102) రైలు నవంబర్‌ 16, 23, 30, డిసెంబర్‌ 28, జనవరి 3 తేదీల్లో రాకపోకలు సాగిస్తుందని పేర్కొంది. ఈ రైలు వేకువ జామున 2.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని చెప్పింది. ఈ రైళ్లు విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట, కాట్పడి, జోలార్‌పేటై, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, పొదనూర్‌, పాలక్కడ్‌, తిస్సూర్‌, అలువ, ఎర్నాకులం టౌన్‌, కొట్టాయం, తిరువల్ల, చెంగనూరు, కాయంకులం స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ఆయా రైళ్లను అయ్యప్ప భక్తులు వినియోగించుకోవాలని కోరింది.