వైభవంగా పెద్ద జయంతి ఉత్సవాలు

మల్యాల మే 11 (జనం సాక్షి)తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు సోమవారం రెండవ రోజు అత్యంత వైభవంగా కొనసాగాయి.ఉదయం 9 గంటలకు వేద మంత్రోచ్చారణల నడుమ స్థాపిత దేవతారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.అనంతరం హోమము,సుందరకాండ పారాయణము,పంచామృత అభిషేకము, సహస్రనామార్చన భక్తిశ్రద్ధలతో నిర్వహించబడినాయి. మహానివేదన,మంత్రపుష్పము అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.సాయంత్రం 5 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణము,శ్రీ అమ్మవారి కుంకుమార్చన,పుష్పాలతో సహస్రనామార్చన,వివిధ పారాయణాలు నిర్వహించారు.అనంతరం స్థాపిత దేవతారాధన, హోమము,బలిహరణము,మహానివేదన కార్యక్రమాలు వైదిక సంప్రదాయాల ప్రకారం జరిగాయి. భక్తులకు తీర్థప్రసాద వినియోగం నిర్వహించగా, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.భక్తి గీతాలు,హరికథలు,ఆధ్యాత్మిక ప్రదర్శనలు భక్తులను అలరించాయి.
ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ స్థానాచారి కపిందర్,ప్రధాన అర్చకులు రామకృష్ణ, వకులాభరణం రఘు,జితేందర్ ప్రసాద్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. వేదపండితులు పెద్దన్న శర్మ, రాజేశ్వర శర్మ,హరిబాబు శర్మ వేద మంత్రాలతో కార్యక్రమాలకు ఆధ్యాత్మిక శోభను చేకూర్చారు.