అటవీ శాఖ అధికారులపై గన్ను గ్యాంగ్ దాడి

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో అర్థరాత్రి 11:30 ప్రాంతంలో తాడ్వాయి అటవీ శాఖ పరిధిలో ఉన్న దమరవాయి అటవీ ప్రాంతంలో అక్రమంగా చెట్లను (పొడు భూమి) తొలగిస్తున్న జెసిబి యంత్రమును ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వినోద్, ఫారెస్ట్ బీట్ ఆఫీసరులు శరత్ చంద్ర, సుమన్ బృందం జెసిబి యంత్రాన్ని అదుపులోకి తీసుకొని తాడ్వాయి అటవీ కార్యాలయంనకు తరలించే క్రమంలో తాడ్వాయి సమీపంలో జెసిబి యజమాని గంట సూరజ్ రెడ్డి (నిక్ నేమ్.. గున్ను), మరో ఇద్దరితో కలిసి అటవీ శాఖ అధికారులపై విచక్షణా రహితంగా ఇనుప రాడ్ లతో దాడి చేసినారు. అటవీశాఖ అధికారుల వాహనం లైట్స్ ను పగలగొట్టినారు. ఈ ఘటన తర్వాత జెసిబి తో అక్కడినుంచి వెళ్లిపోయారు.జెసిబి యజమాని చేసిన ఈ దాడిలో సెక్షన్ ఆఫీసర్ వినోద్ తలపై మూడు చోట్ల పెద్ద గాయాలయ్యాయి. అతని చేతి వేళ్ళు విరిగి ముక్కలు అయినవి,
బీట్ ఆఫీసర్ శరత్ చంద్రకు తీవ్రమైన గాయాలు అయినవి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.