శ్రీ దివ్య సంజీవని హనుమాన్ ఆశ్రమంలో: ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
ఎడపల్లి, (జనంసాక్షి) : ఎడపల్లి గ్రామ శివారులోని అంబం గేటు వద్ద గల నర్సాపూర్ శ్రీ దివ్య సంజీవని హనుమాన్ ఆశ్రమంలో శ్రీ రామదాసి సురేష్ అత్మారామ్ మహారాజ్, జైరాం మహారాజ్, రాజేష్ జోషి, దనుమహారాజ్ ఆధ్వర్యంలో స్వామి వారికి ఉదయం పంచామృత అభిషేకాలు, సింధూర పూజా, శోడశోపచార పూజలతో పాటు అనంతరం భక్తులకు మహా అన్న ప్రసాదంను అందించడం జరిగింది .అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ సందర్భంగా శ్రీ రామదాసు సురేష్ ఆత్మరామ్ మహారాజ్ భక్తులకు ప్రవచనాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గిర్థవర్ గంగారెడ్డి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ మాణిక్ రజిత యాదవ్, ఎడపల్లి గ్రామస్తులు మాణిక్ ఎల్లయ్య యాదవ్, ఆకుల శ్రీనివాస్, మల్లెపూల గంగామణి, నర్సింగ్, కంజర్ వినాయక్ రాజు, మల్లెపూల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, నటరాజ్ గౌడ్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.