గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరుకు కృషి చేస్తా: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

జనం సాక్షి రాయికల్ : శుక్రవారం రోజున జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా కార్యదర్శి యం.ఏ.మోఖీద్ ఆధ్వర్యంలో రాయికల్ మండల అల్లిపూర్ గ్రామానికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు కలిసి అల్లిపూర్ గ్రామంలో కోనమ్మ చెరువు వద్ద గంగమ్మ తల్లి దేవాలయం నిర్మాణం మరియు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కి వినతి పత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే కి సంఘ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘ అధ్యక్షులు తోపారపు ప్రశాంత్, వార్డ్ మెంబర్ కల్లెడ గంగాధర్, ఉపాధ్యక్షులు రాజశేఖర్, కార్యదర్శి కల్లెడ రాకేష్,అర్ముళ్ల పవన్, పళ్ళికొండ గంగాధర్, రవి, రెడ్డి, రాహుల్, శంకర్, శివకుమార్, నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రావు, దొబ్బల వేణు తదితరులు పాల్గొన్నారు.



