మండలవ్యాప్తంగాఅంతర్జాతీయ కార్మిక దినోత్సవం

జెండాను ఆవిష్కరించిన కార్మికుల సంఘాల అధ్యక్షులు, గుడికడి కుమార్, బిక్షపతి, సిద్ధిరాములు, సెస్ సిబ్బంది…
గంభీరావుపేట మే 01(జనం సాక్షి);గంభీరావుపేట మండల వ్యాప్తంగా ప్రపంచ కార్మిక మేడే దినోత్సవం ఘనంగా నిర్వహించారు, ఇందులో భాగంగా, భవన నిర్మాణ కార్మిక అధ్యక్షులు గుడికడి కుమార్, పారిశుద్ధ కార్మిక అధ్యక్షులు, బిక్షపతి, హామాలి సంఘ అధ్యక్షులు అక్క పెళ్లి సిద్ధిరాములు, పెయింటర్ అసోసియేషన్ అధ్యక్షులు కాడారి సత్యం సెస్ సిబ్బంది వారి వారి సంఘాలలో ప్రధాన కూడలిలో మే డే జెండా ఆవిష్కరణ చేసి శుభాకాంక్షలు తెలిపారు, వారు మాట్లాడుతూ కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు.
ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేమూ మనుషులమే, మా శక్తికి కూడా పరిమితులుంటాయి. ఈ వెట్టి చాకిరీ మేం చేయలేమని పని ముట్లు కింద పడేసి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడటం, చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం. 24 గంటలలో ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి (రెస్టు), ఇంకా ఎనిమిది గంటలు రిక్రీయేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా సాధించుకున్నారు. ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తర్వాత కలిగిందని తెలిపారు, ఈ కార్యక్రమంలో, మాజీ జెడ్పిటిసి మల్లు గారి నర్సాగౌడ్, మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోసాల చంద్రం, భవన కార్మిక సంఘాల, అధ్యక్షులు గుడికాడ కుమార్, ఉపాధ్యక్షులు సిరిపురం శంకర్, ప్రధాన కార్యదర్శి, మల్లేశం, కోశాధికారి శ్రీహరి, పారిశుద్ధ కార్మికుల అధ్యక్షులు బిక్షపతి, ఉపేంద్ర, కార్మిక సంఘ సభ్యులు, హమాలీ సంఘ అధ్యక్షులు సిద్ధిరాములు, సభ్యులు, పాల్గొన్నారు



