పల్లా రాజేశ్వర్ రెడ్డికే జనగామ టికెట్
హైదరాబాద్ : జనగామ బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎంపికపై ఎట్టకేలకు సందిగ్దత వీడిరది. ఆ స్థానాన్ని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికే కేటాయిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. పల్లా, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య సయోధ్య కుదిర్చిన పార్టీ పెద్దలు.. పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.