మాజీ ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిక

 

 

 

 

చెన్నారావుపేట, డిసెంబర్ 2 (జనం సాక్షి):

గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి….

మండలంలోని కందిగడ్డ తండ గ్రామ కాంగ్రెస్ నాయకులు గుగులోతు కృష్ణ, గుగులోతు జాను, జోజిపేట నారాయణ తండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బాదావత్ భరత్, అమృతండ గ్రామానికి చెందిన యువ నాయకులు బోడ భీమ్ సింగ్, లావుడియా రమేష్ లు బిజెపి పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ మండల అధ్యక్షులు బాల్నె వెంకన్న, మండల ఎన్నికల కన్వీనర్ జక్క అశోక్ ల ఆధ్వర్యంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మంగళవారం మండల కేంద్రంలోని బిఆర్ఎస్ కార్యాలయంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల కుమారస్వామి, మండల ప్రధాన కార్యదర్శి భూక్య రవీందర్ నాయక్, ములుక సాంబయ్య కవి, చెన్నారావుపేట మాజీ సర్పంచ్ కుండె మల్లయ్య, అండ్ర బాలజోజి, సాదు నర్సింగరావు, సోషల్ మీడియా మండల ఇన్చార్జి బోడ మురళి నాయక్, గుగులోతు స్వామి నాయక్, ప్రభాకర్, రాస మల్ల సతీష్, గొడిశాల సురేందర్, కంకల రాజు, కంది గడ్డ తండా గ్రామ అధ్యక్షులు మాలోతు పాప, తదితరులు పాల్గొన్నారు.