పుల్కల్ లో మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలు

పుల్కల్ : మండల కేంద్రమైన సింగూర్ లో దర్గా పీథాధిపతి మహ్మద్ అబిద్ హుస్సేన్ సత్తరుల్ ఖాద్రీ సహేబ్ ఆధ్వర్యంలో హజ్రత్ మహ్మద్ పీర్ బాబన్ షా వలీ ర.హ దర్గ షరీఫ్, ఖాజా బందననవాజ్ ఉర్సు ఉత్సవాలను పుర్కరించుకొని ఆదివారం నాడు కబడ్డీ , వాలీబాల్ పోటీలు నిర్వహించగా మండలోని వివిధ గ్రామాల నుండి కబడ్డీ 12 టీంలు, వాలీబాల్ 18 టీంలు పాల్గొన్నాయి. ఈ క్రీడ పోటీలలో క్రీడకారులు ఉత్సహంగా పాల్గొని పోటీ పడ్డారు. కబడ్డీ విజేతలుగా ప్రథమ బహుమతి సింగూర్ టీం, ద్వితీయ బహుమతి మింపూర్ టీం, కైవసం చేసుకోగా, వాలీబాల్ పోటీలలో ప్రథమ బహుమతి ముద్దాయిపేట టీం కాగా ద్వితీయ బహుమతి మునిపల్లి టీం విజేతలుగా నిలిచింది. వీరికి దర్గా పీథాధిపతి మహ్మద్ అబిద్ హుస్సేన్ సత్తరుల్ ఖాద్రీ సహేబ్, సింగుర్ సర్పంచ్ రాజాగౌడ్, ఉప సర్పంచ్ మదార్, చేతుల మీదగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌస్ సాహేబ్, సయ్యద్ అజ్మత్, తజోద్దిన్, ఖయ్యుమ్, నసీరుద్దిన్, నఖీబ్, షాహేద్ తదితరులు పాల్గొన్నారు.