అయ్యప్ప ఆశీస్సులు అందరి మీద వుండాలి : ఉప్పల శ్రీనివాస్ గుప్త

హైదరాబాద్ (జనంసాక్షి)అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరి మీద వుండాలి అని TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. చంపాపేటలో పుల్లురి ఉపేందర్ గుప్త నివాసంలో మరియు నాగోల్ కోపరేటివ్ బ్యాంక్ కాలనీ రవీందర్ గౌడ్ నివాసంలో జరిగిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూఅయ్యప్ప పడిపూజ అనేది శ్రీ అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా శబరిమల యాత్ర సమయంలో చేసే ఒక ప్రత్యేక సేవ. ఇది శబరిమల దేవస్థానంలో, వివిధ అయ్యప్ప స్వామి ఆలయాలలో ఆచరించబడే కీలక సంప్రదాయం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో IVF ప్రధమ మహిళ ఉప్పల స్వప్న, IVF మహిళా ప్రతినిధులు యూత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


