ఎంజీఎంలో వైద్య సేవలు అధ్వానం
మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజీఎం) దవాఖానలో వైద్య సేవలు అధ్వానంగా మారాయి. వరంగల్ నగరాన్ని హెల్త్ సిటీగా మార్చే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ఎనిమిది నెలలుగా ఎంజీఎంకు కొత్తగా వైద్య పరికరాలు రాలేదు. ఉన్నవాటి నిర్వహణనూ పట్టించుకోవడం లేదు. వ్యాధుల నిర్ధారణ పరీక్షలు అరకొరగానే నిర్వహిస్తున్నారు. దీంతో పరీక్షల కోసం పేద రోగులు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు.