రేగోడు గాంధీ భవన్ సందర్శించిన మంత్రి దామోదర రాజనర్సింహ

రేగోడు,ఏప్రిల్25(జనంసాక్షి): మెదక్ జిల్లా మండల కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జాతర ఉత్సవాల సందర్భంగా శనివారం ఆలయంలో ప్రత్యేకంగా పూజలకి పాల్గొన్న ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ. అనంతరం రేగోడ్ లోని గాంధీ భవన్ ను రాష్ట్ర మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ సందర్శించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.అనంతరం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ పిఎసిఎస్ చైర్మన్ శ్యామ్ రావు కులకర్ణితో పాటు నాయకులకు,ప్రజలకు ఆప్యాయంగా పలకరించి బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి దామోదరను శాలువ పూలమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్లేటి రాధా కిషన్, నారాయణ,నాగేందర్రావు కులకర్ణి, మాజీ ఎంపీటీసీ అనిత రామాగౌడ్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ నాల చెరువు రాధా కిషన్, సంగప్ప,కల్లేటి రమేష్,తుల్జారాం,శేఖర్,వడగామ నగేష్,ఎల్ రాజు, రాములు,సాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.