ఓటు హక్కును వినియోగించుకున్న నర్సంపేట ఎమ్మెల్యే దొంతి…

 

 

 

 

 

 

చెన్నారావుపేట, డిసెంబర్ 17 (జనం సాక్షి): మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే తనయుడు దొంతి అవియుక్త్ రెడ్డి…రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తన స్వగ్రామమైన చెన్నారావుపేట మండలంలోని అమీనాబాద్ గ్రామంలో తన సతీమణి శాలిని రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బుధవారం 8వ వార్డులో తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. తన కుమారుడు అవియుక్త్ రెడ్డి మొదటిసారి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఓటు హక్కును మొదటిసారి వినియోగించుకోవడానికి అమెరికా నుండి అమీనాబాద్ గ్రామానికి వచ్చినట్లు అవియుక్త్ రెడ్డి తెలిపాడు.