కాంగ్రెస్‌లో విలీనానికి షర్మిలకు నో ఛాన్స్
హైదరాబాద్: అసెంబ్లీ బరిలో పోటీ స్థానంపై వైస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల(Sharmila) క్లారిటీ ఇచ్చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచే షర్మిల ఎన్నికల రణరంగంలోకి దిగబోతున్నారు. గురువారం నాడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి లోటస్ పాండ్‌లో వైస్సార్టీపీ కీలక నేతలతో షర్మిల అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి కార్యాచరణ రూపొందించాలనే అంశంపై పార్టీ క్యాడర్‌తో చర్చిస్తున్నారు. ఈరోజు నుంచే ఎన్నికల బరిలోకి దిగేలా షర్మిల ప్లాన్ చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ.. ప్రచారంపై కార్య కర్తలకు సమావేశంలో షర్మిల దిశానిర్దేశం చేయనున్నారు. పాలేరుతో పాటు మిర్యాలగూడలో షర్మిల పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. కార్యవర్గ సమావేశం అనంతరం ఎన్నికల అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఆరుగురు సభ్యులతో మేనిఫెస్టో కమిటీని షర్మిల ఏర్పాటు చేయనున్నారు. రేపటి నుంచి అన్ని నియోజకవర్గాలల్లో YSRTP నేతలు ఎన్నికల బరిలో ఉండేలా ప్రణాళిక చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం అనంతరం మీడియాతో షర్మిల మాట్లాడే ఛాన్స్ ఉంది.