త‌న కొడుకును చంద్రబాబుకు ప‌రిచయం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి చరిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటిచేయ‌గా.. ఏకంగా 164 సీట్లు గెలిచింది. సుమారు 94 శాతం సీట్లు సాధించి దేశంలోనే సంచలనం రేపింది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి చరిత్ర సృష్టించిన విష‌యం తెలిసిందే. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగానూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పోటిచేయ‌గా.. ఏకంగా 164 సీట్లు గెలిచింది. సుమారు 94 శాతం సీట్లు సాధించి దేశంలోనే సంచలనం రేపింది. ఏపీ చరిత్రలోనే ఇది భారీ మెజార్టీ కాగా వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అయితే ఈ విజ‌యం అనంత‌రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో స‌మ‌వేశం అయ్యాడు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ త‌న కొడుకు అకీరా నందన్‌ను చంద్ర‌బాబుకు ప‌రిచ‌యం చేశాడు. అనంత‌రం అకీరా చంద్రబాబు కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నాడు.