హైడ్రాతో పేదలకు ఇబ్బందులు లేవు

హైడ్రాతో పేదలకు ఇబ్బందులు లేవని, ఇండ్లు కోల్పోయే పేదలకు మరో చోట డబుల్‌ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారని మంత్రి సీతక్క తెలిపారు. అమృత్‌ పథకంలో ఏమైనా తప్పిదాలు జరిగితే కేంద్రమే చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.గురువారం పెసా జాతీయ సదస్సులో పాల్గొన్న అనంతరం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో తనను కలిసిన మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సీతక సమాధానమిచ్చారు. రేవంత్‌రెడ్డి బంధువు అయినందునే సృజన్‌రెడ్డికి అమృత్‌ టెండర్లు దకాయన్న విమర్శలు సరికావని చెప్పారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదన్న కారణంతో గ్రామ పంచాయతీలకు కేంద్రం నిలిపివేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ సహాయమంత్రి ఎస్‌పీసింగ్‌ బఘేల్‌ను సీతక్క కోరారు.