వర్షాకాల ముంపు నివారణకు ఉప్పల్‌లో ముందస్తు చర్యలు
ఉప్పల్ మే 7 ( జనం సాక్షి ):ఉప్పల్ నియోజకవర్గంలో వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రధాన నాలాల్లో పూడికతీత పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి తెలిపారు.గురువారం ఉప్పల్ డివిజన్ పరిధిలో రూ.40 లక్షల వ్యయంతో చేపడుతున్న నాలాల పూడికతీత పనులను మాజీ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, ముంపు సమస్యలు రాకుండా అన్ని ప్రధాన నాలాలను శుభ్రపరుస్తున్నామని ఆయన తెలిపారు.శేషసాయి నగర్ నుండి నల్లచెరువు వరకు, కావేరి నగర్ కాలనీ నుండి నల్లచెరువు వరకు, అలాగే రామంతాపూర్ టీవీ కాలనీ నుండి సత్యనగర్ కల్వర్ట్ వరకు నాలాల పూడికతీత పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. నాలాల్లో పేరుకుపోయిన మురుగు, చెత్తను పూర్తిగా తొలగించి నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించిన ఆయన, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ పనులపై స్థానిక ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ సమస్యల పరిష్కారానికి ముందుకొస్తున్న మందుముల పరమేశ్వర్ రెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఈ వెనీల్ గౌడ్, ఏఈ రాజ్ కుమార్, నరసయ్య, ప్రభాకర్, రాకేష్ నాయక్, సల్లా ప్రభాకర్ రెడ్డి, పవన్, శ్రీనివాస్, వేణు, మహేశ్, సత్తిరెడ్డి, సోమరెడ్డి, జగన్ రెడ్డి, నాగేష్, రంగారెడ్డి, గల్లయ్య, ఓబుల్ రెడ్డి, సంతోష్, సమ్మయ్య, గోపి నాయక్ తదితరులు పాల్గొన్నారు.



