శెట్టిపాలెంలో వెల్లివిరిసిన మత సామరస్యం
వేములపల్లి సెప్టెంబర్ 04(జనంసాక్షి): మతసామరస్యానికి ప్రతికగా నిలిచింది వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో చత్రపతి శివాజీ గణేష్ ఉత్సవ కమిటీ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో పురస్కరించుకొని శెట్టిపాలెం గ్రామంలో చత్రపతి శివాజీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుని విగ్రహం వద్ద గురువారం లడ్డు వేలం పాట నిర్వహించారు వినాయకుని లడ్డూ వేలం పాట కార్యక్రమంలో మతసామారస్యం మరోసారి వెలువిరిసి సెట్టిపాలెం గ్రామానికి చెందిన షేక్ సలీం అనే ముస్లిం యువకుడు లడ్డువేలం పాటలో పాల్గొని 29వేల 900 రూపాయలకు వినాయకుని లడ్డును వేలంలో దక్కించుకున్నాడు. కులముతాల కుచ్చులాటలో నలిగిపోతున్న నేటి సమాజాన్ని నిద్ర లేపే విధంగా కుల మతాలకు అతీతంగా హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయకచవితిఉత్సవాలలోముఖ్య మైన లడ్డు వేలంలో ముస్లిం వ్యక్తి పాల్గొని లడ్డూను దక్కించుకోవడం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేయడంతో పాటు అభినందనలు తెలిపారు.వేలంలో వినాయక లడ్డు దక్కించుకున్న సలీం ను చత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ శెట్టిపాలెం సభ్యులు మండపం నుండి అతని ఇంటి వరకు ఆనందోత్సవాల నడుమ అంగరంగ వైభవంగా తీసుకొని వెళ్లారు.