రేవంత్‌ రెడ్డితోనే నాకు పంచాయితీ : కౌశిక్‌ రెడ్డి

హైదరాబాద్‌ : సీఎం రేవంత్‌ రెడ్డితోనే తనకు పంచాయితీ అని, మిగతా ఎవరితోనూ నాకు ద్వేషం లేదని ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ… ఎంపి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తనకు మంచి మిత్రుడని చెప్పారు. డ్రగ్స్‌ కేసులో తనను సీఎం రేవంత్‌ ఇరికించాలని యత్నించారని ఆరోపించారు. నన్ను ట్రాప్‌ చేయలేదని ఇంటలిజెన్స్‌ చీఫ్‌ను ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో సీఎంకు సవాల్‌ విసురుతున్నానని అన్నారు. రేవంత్‌రెడ్డి తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో డ్రగ్స్‌ టెస్టుకు రావాలని డిమాండ్‌ చేశారు. తాము డబ్బా పట్టుకుని రెడీగా ఉన్నామన్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలు కూడా అందరూ ఎదురుచూస్తున్నారని, ఇప్పటివరకు మమ్మల్ని ఎవరూ పిలవలేదని కౌశిక్‌రెడ్డి చెప్పారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక డైవర్ట్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని, రేవంత్‌ రెడ్డి డ్రగ్స్‌ గురించి మాట్లాడితే చిత్తశుద్ధితో మాట్లాడాలని ఈ సందర్భంగా హితవు పలికారు. కేసీఆర్‌ పేరు తలుచుకోకుండా ఎప్పుడైనా సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యిందా అని ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి పాలనలో ఒక్క వర్గం సంతోషంగా లేదని, దేశంలో తుగ్లక్‌ సీఎం రేవంత్‌ రెడ్డి అని ఈ సందర్భంగా విమర్శించారు.

తాజావార్తలు