మాజీ ఎమ్మెల్యే గండ్రను కలిసిన సర్పంచ్ లు

 

 

 

 

 

 

 

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):\భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిని మంగళవారం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు మర్యాద పూర్వకంగా కలిశారు. భూపాలపల్లి మండలం ఎస్ఎం కొత్తపల్లి గ్రామ నూతన సర్పంచ్ ఎల్లగొండ పద్మ తిరుపతి, వార్డు మెంబర్లు, గణపురం మండలం సీతారాంపురం గ్రామ సర్పంచ్ తోట రాకేష్, వార్డుమెంబర్లు గుండు సుభాష్, జంజర్ల సుభద్ర శ్రీను, ఎంకటి దేవేందర్ తదితరులు కలిశారు. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డు సభ్యులను అదే విధంగా వారి గెలుపు కొరకు కృషి చేసిన వారిని మాజీ ఎమ్మెల్యే గండ్ర శాలువాలు కప్పి సన్మానించారు. ఎస్ఎం కొత్తపల్లి గ్రామ సర్పంచ్ ఎల్లగొండ పద్మ తిరుపతి, మారేపల్లి సూర్యప్రకాష్, ఎల్లగొండ సతీష్, దండ్రే రణపతి, మర్రి అశోక్ లు మాజీ ఎమ్మెల్యే గండ్ర సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మండల, గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.