జర్నలిస్ట్ కుమారుడి హత్య కేసులో సంచలనం
మహబూబాబాద్, (జనంసాక్షి బ్రేకింగ్ న్యూస్) :
మహబూబాబాద్ పట్టణంలోని కృష్ణకాలనీలో 9 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, డబ్బులు డిమాండ్ చేసి హత్య చేసిన కేసులో నిందితునికి మరణ శిక్ష పడిరది. అక్టోబర్ 18, 2020న జర్నలిస్ట్ కుసుమ రంజిత్ రెడ్డి కుమారుడైన కుసుమ దీక్షిత్ రెడ్డి సాయంత్రం 5 గంటల సమయంలో కాలనీ పిల్లలతో ఆడుకుంటుండగా శనిగపురం గ్రామానికి చెందిన మంద సాగర్ కొన్ని ఆయిల్ డబ్బాలు తీసుకరావాలని మాయ మాటలు చెప్పి, బండిపై ఎక్కించుకొని దానమయ్య గుట్టపైకి తీసుకెళ్ళాడు. నిద్ర మాత్ర ఇచ్చి గొంతు పిసికి చంపి, పెట్రోల్ పోసి కాల్చేశాడు. ఈ కేసులో సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు మంద సాగరే ఈ నేరం చేసినాడని నిర్ధారించుకొని రెండ్రోజుల్లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న సిఐ రవి కుమార్, సతీష్, ఎస్సైలు అరుణ్ కుమార్, వెంకటా చారి, కోర్టు కానిస్టేబుల్ బి. సంపత్ రెడ్డి, మోహన్, లింగయ్యలను ఉన్నతాధికారులు అభినందించారు.