గొర్రెలు–మేకల్లో నట్టల నివారణ తప్పక త్రాగించాలి

 

 

 

 

 

 

 

 

 

రాయికల్ డిసెంబర్ 29(జనం సాక్షి):

సర్పంచ్ ఎంబారి గౌతమి వెంకట్ రెడ్డి

తెలంగాణ పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు మరియు మేకల్లో నట్టల నివారణ (డీవర్మింగ్) కార్యక్రమం రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎంబారి గౌతమి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పశువైద్య మరియు పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి.ప్రఖాష్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా గొర్రెలు మరియు మేకల్లో డీవర్మింగ్ ఎంత అవశ్యకమో వివరించారు. నట్టల నివారణ వల్ల పశువుల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు బరువు పెరుగుదల, మాంస ఉత్పత్తి, ప్రజనన సామర్థ్యం పెరుగుతాయని, నట్టల వల్ల కలిగే రోగాలు, మరణాలు తగ్గుతాయని తెలిపారు. ప్రతి పెంపకదారుడు శాఖ సూచనల మేరకు కాలానుగుణంగా డీవర్మింగ్ చేయించుకోవాలని సర్పంచ్ ఎంబరీ గౌతమి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖధికారి డా. బి. ప్రకాష్ మాట్లాడుతూ…గొర్రెలకు మేకలకు నట్టల మందు త్రాగంచటం వలన కలుగు ప్రయోజనాలు తెలియ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ ప్రజలు, నాయకులు గంగా రెడ్డి, వెంకటేశ్వర్లు, స్థానిక ఉపసర్పంచ్ గురులింగం మఠం వినయ్, వార్డ్ మెంబర్స్, ఇతర గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గొర్రెల పెంపకందారులు పంతంగి మల్లయ్య, పంతంగి మనోజ్, చెల్కల భీమయ్య, ఇతర గ్రామ ప్రజలు పశువైద్యాధికారి డా. నరేష్ రెడ్డి గడ్డం, మరియు సిబ్బంది శివ కుమార్, అహ్మద్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.