ముషీర్‌నగర్‌లో రూ.10 లక్షలతో మహిళా సమాఖ్య భవనం స్లాబ్ పనులకు శ్రీకారం

సిరికొండ, జూలై 17 (జనం సాక్షి): సిరికొండ మండలంలోని ముషీర్‌నగర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా మంజూరైన రూ.10 లక్షల నిధులతో మహిళా సమాఖ్య భవనం స్లాబ్ నిర్మాణ పనులను మహిళలు ఆనందోత్సాహాల మధ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమ గ్రామానికి మహిళా సమాఖ్య భవనాన్ని మంజూరు చేసిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ నిధులు ముషీర్‌నగర్ గ్రామానికి మంజూరయ్యేలా ప్రత్యేకంగా సహకరించిన జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.మహిళా సంఘం అధ్యక్షురాలు విజయ మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను సొంత కుటుంబ సభ్యుల్లా ఆదరిస్తున్నారని అన్నారు. మహిళలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ప్రభుత్వానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళా సంఘం అధ్యక్షురాలు విజయ, మద్దికుంట లక్ష్మి, పిపావత్ కవిత, బట్టు సరోజిని, మహిళా సంఘాల సీఏ మాలవత్ మూన్‌సింగ్, గ్రామ ఉపసర్పంచ్ ధోని మోహన్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాలవత్ గజన్‌లాల్, మాలవత్ జగ్య నాయక్, పిపావత్ పోట్య, బనవత్ రాజేష్, దెగవత్ పరశురాం, మాలవత్ చందర్, ధోని సతీష్‌తో పాటు గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. నిర్మాణ పనులను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆకాంక్షించారు.



