తల్లి గెలుపు కోసం గ్యాస్ స్టవ్ తో కుమారుడి ప్రచారం

చెన్నారావుపేట, డిసెంబర్ 11 (జనం సాక్షి): తన తల్లి గెలుపు కోసం కుమారుడు గ్యాస్ స్టవ్ తో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాడు. మండలంలోని అమీనాబాద్ గ్రామానికి చెందిన మొగులోజు లలిత నాగేంద్ర చారి సర్పంచ్ ఎన్నికలలో 5వ వార్డు సభ్యురాలిగా పోటీ చేస్తుంది. ఆమెకు గ్యాస్ స్టవ్ గుర్తు రావడంతో తన కుమారుడు ఒకటవ తరగతి చదువుతున్న తనుష్ గ్యాస్ స్టవ్ ను చేత పట్టుకొని ఇంటింటికి తిరుగుతూ గ్యాస్ స్టవ్ గుర్తుకు ఓటు వేసి తన తల్లిని గెలిపించాలని కోరుతున్న తీరు పలువురిని ఆకట్టుకుంటుంది.


