కంఠరెడ్డి తిరుపతి రెడ్డి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మే 10 (జనం సాక్షి )ఏడుపాయల అమ్మవారి సన్నిధిలో బీఆర్ఎస్ నాయకుల అర్చనలు..కంఠరెడ్డి తిరుపతిరెడ్డి దంపతులకు శుభాకాంక్షలు.మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ఏడుపాయల శ్రీ వనదుర్గ భవాని అమ్మవారి సన్నిధిలో బీఆర్ఎస్వీ మెదక్ నియోజకవర్గ నాయకులు గంజి నవీన్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కంఠరెడ్డి తిరుపతిరెడ్డి గారు ఇలాంటి వివాహ వార్షికోత్సవ వేడుకలు మరెన్నో ఆనందంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజాసేవలో ముందుండే తిరుపతిరెడ్డి గారు మరింతగా పేద ప్రజలకు సేవ చేయాలని కోరుకున్నారు. అలాగే భవిష్యత్తులో రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అవకాశం కలగాలని అమ్మవారిని ప్రార్థించారు.అమ్మవారి ఆశీస్సులతో ప్రజాసేవను కొనసాగిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని నాయకులు అభిలషించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చంద్రమోహన్ గౌడ్, ప్రభు గౌడ్, కిరణ్, నాగరాజు,గోపనిసాయి, బిఆర్ఎస్ యువ నాయకులు .



