ఎస్ జి ఎఫ్ ఐ రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థి సిద్దు

 

 

 

 

 

 

 

 

అభినందించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తేజావత్ జయ..

చెన్నారావుపేట, జనవరి 21 ( జనం సాక్షి): ఎస్ జి ఎఫ్ ఐ ఉమ్మడి వరంగల్ జిల్లా సాఫ్ట్ బాల్ సెలక్షన్స్ లో ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి సిద్దు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తేజావత్ జయ తెలిపారు. రాష్ట్రస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలు నిజామాబాద్ లో జనవరి 22 నుండి 24 వరకు నిర్వహించడం జరుగుతుందని ఈ పోటీల్లో సిద్దు పాల్గొంటాడని వ్యాయామ ఉపాధ్యాయురాలు వీరగొని స్వప్న తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థి సిద్దు, వ్యాయామ ఉపాధ్యాయురాలు వీరగోని స్వప్నలను ప్రధానోపాధ్యాయురాలు జయతో పాటు ఉపాధ్యాయులు సునీత, శశిధర్, పిన్నింటి బాలాజీ రావు, ఉదయ్ కుమార్, ఎల్. మొగిలి, కె.మాధవి, వర్దెల్లి సతీష్ కుమార్, హంస రామకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ జాహేద్, క్రాఫ్ట్ టీచర్, చింతకింది ఇందిరలు అభినందించారు.