జీపీ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

 

 

 

 

 

గంభీరావుపేట డిసెంబర్ 17 (జనం సాక్షి):

ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండలాల్లో సందర్శన

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో ఫేజ్ ఎన్నికలలో భాగంగా ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాల్లో ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ బుధవారం పరిశీలించారు.

ముస్తాబాద్ మండలకేంద్రం, నామాపూర్, గంభీరావుపేట మండలం లింగన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, గంభీరావుపేట లోని కేజీ టూ పీజీ విద్యాలయం, ఎల్లారెడ్డిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రం, ఆవరణలో పరిశీలించారు.

కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన

ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పరిశీలించారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారా అని ఆరా తీశారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

పరిశీలనలో ఏఎస్పీ చంద్రయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డీఎస్పీ నాగేంద్రాచారి, డీఆర్డీఓ శేషాద్రి, ఆయా మండలాల ప్రత్యేక అధికారులు జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్, హనుమంతు, అఫ్జల్ బేగం, తహసీల్దార్లు రాంచందర్, మారుతి రెడ్డి, సుజాత, ఎంపీడీఓలు లచ్చాలు, శ్రీధర్, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.