హయత్ నగర్, మే 16 (జనం సాక్షి ) విశ్వకర్మ జాక్ ఆధ్వర్యం లో శనివారం రాష్ట్ర రవాణా, వెనకబడిన తరగతుల సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర వెనకబడిన తరగతుల సంక్షేమ సలహాదారులు వి.హెచ్. హన్మంతరావు, బి సి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్, కమిటీ సభ్యులకురాష్ట్ర విశ్వకర్మ జాక్ కమిటీ చైర్మన్ రాయబండి పాండురంగాచారి, వైస్ చైర్మన్ నందిపేట రవిందర్ ల ఆధ్వర్యంలో రాష్ట్ర విశ్వకర్మలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ సంఘాలన్నీ కలిసి జేఏసీ ఏర్పడడం శుభ పరిణామం అని మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమైన సమస్యలు
1)రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో మా విశ్వకర్మలను, విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ కుల జనాభా క్రింద ప్రకటించకుండా, వృత్తుల వారిగా ఉన్న మా పంచవృతులను, కులాల జనాభాగా విడివిడిగా విడదీసి ప్రకటించడం వల్ల మా విశ్వకర్మ కులం జనాభా తక్కువ సంఖ్యగా చూపబడడం చేత, వెంటనే ఒకే కులంగా, ఒకే జనాభాగా గజిట్ ఇవ్వాలి.
2) ఇటీవల 18కులాల కార్పొరేషన్లను ప్రకటించారు, అందు కుప్రభుత్వానికి మా అభినందనలు తెలుపుతూ మా విశ్వకర్మలకు కూడా వెంటనే కార్పొరేషన్ పా లకమండలిని ప్రకటించాలి.
వారు సానుకూలతను తెలుపుతూ త్వరలో ఒకే కులంగా, ఒకే జనాభాతో పాటు, కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు చేపడతమని హామీ ఇచ్చారు.విడి విడిగా ఉంటే పడిపోతాం…..అంతా కలిసిఉంటే నిలబడతాం…..అంతా ఒక్కటైతే అనుకున్నది సాధిస్తాంవిశ్వకర్మ జాక్ చైర్మన్ రాయబండి పాండురంగా చారిఈ సందర్భంగా రాయబండి పాండురంగా చారి, నందిపేట రవీందర్ లు మాట్లాడుతూ మన విశ్వకర్మ ముద్దుబిడ్డల ప్రయోజనం కోసం, మన రాష్ట్రంలో ఉన్న అనేక సంఘాలుగా కొనసాగుతున్న విశ్వకర్మ సోదరులకు విశ్వకర్మ జాక్ తరపున ఇప్పటికైనా నిజాయితీగా కలసి ఆలోచిద్దాం, కలసి నడుద్దాం, కలసి మన విశ్వకర్మ జాతీయుల ప్రయోజనం కోసం పనిచేద్దాం. మనలో ఉన్న అనైఖ్యత వల్ల దశబ్దాలుగా నష్టపోయాం. రాష్టంలో మన జనాభా దామాషా ప్రకారంగా మన వాటా మనం పొందుదాం. అందుకోసం విశ్వకర్మ జాక్ అన్ని సంఘాలతో చిత్త శుద్ధితో పనిచేస్తుందని తెలుపుచున్నాము.మరొక్కసారి మన సంఘాలన్నిటిని కోరుతున్నాం విడి విడిగా ఉంటే పడిపోతాం, అంతా కలిసిఉంటే నిలబడతాం అనుకున్నది సాధిస్తాం. ఇప్పటికే వృత్తులను కులాలుగా ప్రభుత్వం ప్రకటించడం వలన ఇతర కులాల ముందు తక్కువ సంఖ్యగా కనిపిస్తున్నాము. మన కుల వృత్తులైన కమ్మర వడ్రంగ, కంచర, శిల్పికార, అవుసలా (కంసాలి )ఒకే కులం క్రింద ఉన్న వృత్తులను కులాలుగా ప్రకటించినందుకు మనం మేల్కొనకపోతే నష్టపోతాం ఆలోచించండి! ఇప్పటికైనా మనం ప్రభుత్వాన్ని నిలదీసి ఒకే కులంగా ప్రకటింపజేసుకుందాం, కార్పొరేషన్ ఏర్పాటు చేయించుకుందాం. వ్యక్తిగతంగా ఆలోచించ కుండా, సమిష్టి ప్రయోజనమే ముఖ్యమని, రాష్ట్రంలో ఉన్న సంఘాలన్నీ కలసి వస్తారని ఆశిస్తున్నాము.వ్యక్తిగతంగా మనలో, జ్ఞానవంతులమైన, ఆర్థికంగా సంపన్నులమై ఉండవచ్చు, అందుకు మనం గర్విద్దాం! కానీ మన జాతి ఉమ్మడి ప్రయోజనం కోసం కలసి రాకపోతే నష్టానికి కారణం కామా!దయచేసి ఆలోచించండి!! సంఘాల నాయకులారా!మనలో మనకు ఎన్ని అభిప్రాయా బేదాలున్నా జాతి ప్రయోజనం కోసం మాత్రం ఏకంగా ఉందాం, ఒకటిగా నడుద్దాం! మనజాతి కోసం గజం గజం కదిలి – భుజం భుజం కలుపుదాం!! కలసి నడుద్దాం!!! ఒకే మనస్సుతో, ఒకే ఆలోచనతో, అందరం కలసి పనిచేద్దాం !!!! రండి మేలుకోండి మన జాతి మేలు కోసం, మంచి నాయకత్వం ఇద్దాం రారండి.!ఈ కార్యక్రమంలో విశ్వకర్మ జేఏసీ నాయకులు మోత్కూరి మల్లాచారి, మారోజు సునీల్ కుమార్, జయకరణ్ చారి, రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.



