గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం

చెన్నారావుపేట, జనవరి 4 (జనం సాక్షి):
నర్సంపేట లయన్స్ క్లబ్ గ్లోరీ అధ్యక్షులు మోతె సమ్మిరెడ్డి…
గ్రామ సర్పంచ్ ననుమాస కరుణాకర్…
పాత ముగ్దుంపురంలో మెగా ఉచిత వైద్య శిబిరం
గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని నర్సంపేట లయన్స్ క్లబ్ గ్లోరీ అధ్యక్షులు మోతె సమ్మిరెడ్డి, పాత ముగ్దుంపురం గ్రామ సర్పంచ్ ననుమాస కరుణాకర్ లు అన్నారు. ఆదివారం మండలంలోని పాత ముగ్దుంపురం గ్రామంలోని పోచమ్మ తల్లి ఆలయం వద్ద నర్సంపేట లయన్స్ క్లబ్ గ్లోరీ, వేములపల్లి మొగిలి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో నర్సంపేటకు చెందిన ప్రముఖ వైద్యులు వజ్జ సాగర్, మోతె నవత, శంకర్, పడాల రాహుల్, ఎడ్ల రమేష్, సింధూరి, మట్ట భరత్ రెడ్డిలు పాల్గొని గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వేములపల్లి మొగిలి మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షులు వేములపల్లి రాజు, లయన్స్ క్లబ్ గ్లోరీ కార్యదర్శి మోతె ఇంద్రసేనారెడ్డి, ట్రెజరర్ మహమ్మద్ యాకూబ్, కాకతీయ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీరమల్ల మాధవరెడ్డి, కూతురు వీరారెడ్డి, చెవ్వ రాజేంద్రప్రసాద్, వరంగంటి సంతోష్, బొనగాల శ్రీనివాస్, గ్రామ ఉపసర్పంచ్ అలువాల శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.



