పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వీడాలి

  • బెక్కెం జనార్దన్ అధ్యక్షులు ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల సాధన జేఏసీ
  • పిఆర్ఎల్ఐ ను ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలి-కృష్ణా నది ఎగువనబ్యారేజీ నిర్మాణం చేపట్టాలి .

 

మహబూబ్ నగర్ ప్రతి నిధి, మే 26 ,(జనం సాక్షి ): రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తో పాటు జిల్లాల ఉన్న అన్ని ప్రాజెక్టులపట్ల నిర్లక్ష్య ధోరణి వీడాలని ఉమ్మడి ప్రాజెక్టుల సాధన జేఏసీ జిల్లా అధ్యక్షులు బెక్కెం జనార్దన్ అన్నారు . మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఉమ్మడి ప్రాజెక్టుల సాధన జేఏసీ మరియు పాలమూరు అధ్యయన వేదిక సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాలమూరును అన్ని ప్రభుత్వాలు రాజకీయంగా వాడుకున్నాయే తప్ప అభివృద్ధిలో మాత్రం వెనకబాటులోనే ఉంచారన్నారు . జిల్లా సస్యశ్యామలంగా మారాలంటే పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మరింత చొరవ తీసుకొని ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు ముందుకురావాలని కోరారు . జిల్లాలో ఉన్న రైతాంగం కోసం ప్రతి ఒక్కరు ముందుకు కదిలి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసేవరకు. మేము ప్రజాప్రతినిధుల వెంట పడతామని తెలిపారు . ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ప్రజలు క్షమించరని అయన తెలిపారు .కృష్ణా నది ఎగువన బ్యారేజీ నిర్మాణం చేపట్టాలి పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షులు రాఘవాచారి కృష్ణ నది ఎగువన బ్యారేజీ నిర్మాణం చేపట్టాలని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షులు రాఘవాచారి తెలిపారు .తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నందున, పరస్పర సద్భావనతో పాలమూరు, రంగారెడ్డి జిల్లాల సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవాలని అయన డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం సాగునీటి అంశాలపై తక్షణమే చర్చలు జరిపి సత్ఫలితాలు సాధించాలి అని కోరారు . తుంగభద్ర నదిపై ఉన్న రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ అనకట్ట పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలి