మహిళల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి
భూదాన్ పోచంపల్లి, జనవరి 23 (జనం సాక్షి): మహిళలలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్షమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని జె వి ఫంక్షన్ హాల్ లో మెప్మా ఆధ్వర్యం లో మహిళా సంఘాలకు సుమారు రూ.1 కోటి 11 లక్షల విలువైన వడ్డీ లేని రుణాల చెక్కులను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలోనే భువనగిరి నియోజకవర్గంలో స్త్రీ నిధి పథకం ద్వారా మహిళా సంఘాలకు మొత్తం రూ.17 కోట్ల 99 లక్షల నిధులు అందజేశామని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు.
అనంతరం మార్కండేయ స్వామి వారి 49వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే పట్టణ కేంద్రంలోని పలు వార్డులను సందర్శించి స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించి పలు అభివృద్ధి పనులకు వరుసగా శంకుస్థాపనలు చేశారు. నారాయణగిరి వద్ద కల్వర్ట్ నిర్మాణ పనులు, సీతవాణి గూడెం నందు స్మశాన వాటిక అభివృద్ధి పనులు, మాధవరెడ్డి చౌరస్తా అభివృద్ధి పనులు, ప్రభుత్వ దవాఖాన వద్ద సిసి రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులు, పద్మ నగర్ పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం వద్ద నూతన మీటింగ్ హాల్‌ను ప్రారంభించారు. అలాగే రేవనపల్లి వద్ద కల్వర్ట్ నిర్మాణ పనులు, బసవలింగయ్య స్వామి కాలనీలోని డబుల్ బెడ్ రూమ్, కాలనీ అభివృద్ధి పనులు, ముక్తాపూర్ చెరువు కట్ట అభివృద్ధి పనులకు కూడా ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీవో శేఖర్ రెడ్డి, తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి, ఆర్‌ఐ వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాక మల్లేష్, పట్టణ అధ్యక్షులు భారత లవ కుమార్,రాష్ట్ర నాయకులు తడక వెంకటేశ్, మాజీ ఎంపీటీసీ కొట్టం కరుణాకర్ రెడ్డి, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ కళ్లెం రాఘవరెడ్డి, జిల్లా నాయకులు సామ మధుసూదన్ రెడ్డి, మర్రి నరసింహారెడ్డి, గునిగంటి రమేష్, గోరంటి శ్రీనివాస్ రెడ్డి, గునిగంటి వెంకటేష్, బండారు ప్రకాశ్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


