మే పుష్పం వచ్చేసింది సరదాలు తెచ్చేసింది

 

 

 

 

 

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి మే 09: జనం సాక్షి

నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నర్సింగ్ పల్లి గ్రామంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి సోలమన్ ఇంట్లో మే పుష్పముసంవత్సరానికి ఒకసారి కనులపండుగ చేస్తుంది.పుష్పం వచ్చే ముందు ఆకులన్ని కాండముతో సహా ఎండిపోయి మే మాసము రాగానే మొదట తామర పుష్పం లాగా మొగ్గ వచ్చి వికసిస్తుంది. వచ్చిన 15 నుండి 20 రోజులు ఇంటికి వచ్చినవారందరికి కనులవిందు చేస్తుంది. కోతుల బా రినుండి వీటిని కాపాడుకోడానికి కాపలా మరియు రక్షణ ఇవ్వాల్సి వస్తుంది.ఇదొక ప్రకృతి ఇచ్చిన ఆనందం. ఈ అరుదైన దృశ్యం జనం సాక్షి క్లిక్ మనిపించింది.