పాలకవర్గ సభ్యులు సమన్వయంతో గ్రామను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలి

 

 

 

 

 

 

ఎంపీడీవో బి. చిరంజీవి..
రాయికల్ జనవరి 3 (జనం సాక్షి):రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామపంచాయతీ నూతన వార్డ్ మెంబర్లు శుక్రవారం రోజున మర్యాదపూర్వకంగా స్థానిక మండల కేంద్రంలోని మండల ఎంపీడీవో బి. చిరంజీవి,ను కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ….పాలకవర్గ సభ్యులు సమన్వయంతో గ్రామను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని మరియుఅర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని మరియుతాగునీరు ఆరోగ్యంతో పాటు మౌలిక వసతుల కల్పనకు పాటుపడి గ్రామను సుందరంగాతీర్చిదిద్దాలని.. గ్రామంలోని సమస్యలను గురించి ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని వార్డ్ మెంబర్లకు ఎంపీడీవో చిరంజీవి సూచించారు. గ్రామ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని భరోసానిచ్చారు. నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ అభినందించారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు ప్రశాంత్, సాయి, పరుశురాం, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.