రైతు బోరుబావిని ధ్వంసం చేసిన దుండగులు

 

 

 

 

 

 

 

 

 

గుర్రంపోడు: జనవరి 03 (జనంసాక్షి)రైతు బోరుబావిని దుండగులు ధ్వంసం చేసిన ఘటన మండలంలోని మొసంగి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మొసంగి గ్రామానికి చెందిన ఆడెపు లింగయ్య బోరుబావిని గుర్తు తెలియని దుండగులు డిసెంబర్ రాత్రి 31న బోరుబావిని ధ్వంసం చేశారు. ఇదే విషయమై రైతు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రైతుకు నష్ట పరిహారం చెల్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు.