భూపాలపల్లిలో టీఆర్పీ నేతల నిరసన
జయ
శంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో
తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి పార్టీలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి క్యాబినెట్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ తరుపున 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగిందని, కాని ఇప్పుడు జరగబోయే శీతాకాల పార్లమెంటు సమావేశాలకు అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్లి, కేంద్రంతో బీసీ రిజర్వేషన్లపై మాట్లాడి షెడ్యూల్ 9 లో చేర్చడం కోసం కృషి చేయాలని డిమాండ్ చేశారు.
దానికి మద్దతుగా అన్ని పార్టీలు కూడా ద్వంద వైఖరి వీడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం, విద్య, ఉద్యోగ, వ్యాపార అన్ని రంగాలలో దామాషా ప్రకారం దక్కవలసిన వాటి కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. ప్రజలందరు బీసీ వ్యతిరేక పార్టీలను బొంద పెట్టవలసినటువంటి అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఇనుగాల ప్రణయ్ రాజ్, గండు కరుణాకర్, తీన్మార్ జై అశోక్, శ్రీకాంత్, కిరణ్ పాల్గొన్నారు.



