Tspsc టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఏర్పాట్లు పూర్తి…..

గ్రూప్ 1  పరీక్ష సందేహాలకు హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెo.18004253424..
జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 9154252936..
ఫోటో రైటప్: 1. సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ గోపి
 2. హాజరైన తాసిల్దారులు అధికారులు లైజనింగ్ అధికారులు..
వరంగల్ బ్యూరో అక్టోబర్ 12  ( జనం సాక్షి)
    గ్రూప్ వన్ పరీక్ష కేంద్రాల సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లా కలెక్టరేట్ లో ఫ్రీ హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు చేయనైనదని జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి  అన్నారు.
బుధవారం వరంగల్ కలెక్టరేట్లో తహసిల్డార్స్, లైజనింగ్ అధికారులు, ఎగ్జామినేషన్ చీప్ సూపర్డెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
 ఈ  సమావేశంలో జిల్లా కలెక్టర్ గోపి  మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 9716 మంది కాండేట్లు పరీక్ష రాయనున్నారని వారికి 27 సెంటర్లు కేటాయించడం జరిగిందని వాటి రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. ఇన్విజిలేటర్ ను ఏర్పాటు చేసి కలెక్టరేట్ కు రిపోర్ట్ చేయాలని  అన్నారు.
టీఎస్పీఎస్సీ గైడ్లైన్స్ తూచా తప్పకుండా పాటించాల్సిందిగా చీఫ్ సూపర్డెంట్ లను లైసెన్ ఆఫీసర్లను ఆదేశించారు.
ఒక్కొక్క రూం లో 26 మంది అభ్యర్థులు  కుర్చునెలవ్ ఏర్పాట్లు చేయాలని,  ఒక్కొక్క  టేబుల్ కి ఒక్కరూ మాత్రమే కూర్చునే లా ఏర్పాట్లు చేయాలని వారు అన్నారు.
శుక్రవారం రోజున ట్రైనింగ్ ఏర్పాటు చేయ నున్నట్లు వారు అన్నారు. అర్ధ గంటకు ఒక్కసారి బెల్  మోగెలా ఏర్పాటు చీప్ సూపర్డెంట్             చూసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ అన్నారు.
దివ్యంగులు ఎవ్వరైనా పరీక్ష రాసేందుకు  ఉన్నట్లు అయితే వారి   స్క్రబ్ వివరాలు ముందుగా సబ్మిట్ చేయాలని  వారు అన్నారు.
ఈ సందర్భంగా డిసిపి వెంకట్ లక్ష్మి  మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద తగినంత మందిని పోలీస్ , మహిళా పోలీస్ లను ఏర్పాటు చేయడo జరుగుతుందని  డిసిపి అన్నారు .
మెటల్ డిటెక్టర్ , హ్యాండ్ డైరెక్టర్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగుండా జాగ్రతలు తీసుకుంటామని  వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు హరి సింగ్, శ్రీవత్స కోట, డీసీపీ వెంకట లక్ష్మీ,  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Attachments area